ఆరోగ్యం, రోగ నిరోధక శక్తికి ఇవి వాడండి: మోదీ

తాజా వార్తలు

Published : 02/04/2020 14:13 IST

ఆరోగ్యం, రోగ నిరోధక శక్తికి ఇవి వాడండి: మోదీ

ట్విటర్‌లో పిలుపునిచ్చిన ప్రధాని

న్యూదిల్లీ: కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి వేల మంది ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. కొవిడ్-‌19పై పోరాడేందుకు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుకోవటం ముఖ్యమని ఆయుష్‌ మంత్రిత్వశాఖ సూచించింది. ఇందుకు కాచిన నీటిని తాగాలని, ప్రాణాయామం, 30 నిమిషాలపాటు ధ్యానం చేయాలని ఆ శాఖ ప్రకటించింది. అంతేకాకుండా, ఆహారంలో జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి ఉపయోగించాలని కూడా ఆయుష్‌ మంత్రిత్వ శాఖ సూచించింది. శరీరంలో ఆరోగ్యం మెరుగుపడడానికి, రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఈ పదార్థాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, ఆయుష్‌ మంత్రిత్వశాఖ సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్-‌19కు మందు లేదు. నివారణ కంటే నిరోధకత మంచిదని మనందరికీ తెలుసు.  కాబట్టి ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రోటోకాల్స్‌ను పాటించండి’ అనిమోదీ ట్విట్‌ చేశారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని