ఆస్పత్రిలో తబ్లిగి సభ్యుల ఆగడాలు

తాజా వార్తలు

Updated : 03/04/2020 12:37 IST

ఆస్పత్రిలో తబ్లిగి సభ్యుల ఆగడాలు

అసభ్య ప్రవర్తన తదితర ఆరోపణలు

ఘజియాబాద్‌: అసభ్య ప్రవర్తన, ప్రభుత్వ సిబ్బందికి సహకరించకపోవటం తదితర ఆరోపణలపై కొందరు తబ్లిగి జమాత్‌ సభ్యులపై కేసు నమోదు చేసినట్టు ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు తెలిపారు. దిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన మర్గజ్‌కు హాజరైన వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌, ఘజియాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. 

కాగా జమాత్‌ సభ్యులు కొందరు ఆ ఆస్పత్రి ఐసొలేషన్‌ వార్డు పరసరాల్లో అర్ధనగ్నంగా తిరగటం, నర్సింగ్‌ సిబ్బంది సమీపంలో అసభ్యంగా పాటలు పాడటం వంటి చర్యలకు పాల్పడినట్టు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. అంతేకాకుండా తమకు పొగాకు, సిగరెట్లు కావాలని కొందరు డిమాండ్‌ చేసినట్టు ఆస్పత్రి సిబ్బంది చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం విషయాన్ని చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌, జిల్లా ఎస్పీ, మేజిస్ట్రేట్‌ల దృష్టికి లిఖిత పూర్వకంగా తీసుకువచ్చారు.

కొందరు తబ్లిగి సభ్యులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయని ఘజియాబాద్ ఎస్పీ కళానిధి నైతాని తెలిపారు. స్త్రీల పట్ల అవమానకర ప్రవర్తన, అసభ్య ప్రవర్తన, అంటువ్యాధులు వ్యాప్తించే విధంగా ప్రవర్తించి తద్వారా ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించటం వంటి నేరాలకు పాల్పడినందుకు వారిపై కేసు నమోదు చేశామని ఆయన వివరించారు. సంఘటనపై అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌, ఎస్పీ స్థాయి అధికారులు విచారణ చేపట్టారు. ఏ విధమైన దుష్ప్రవర్తనను సహించబోమని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని