అమెరికన్లు కరోనా నిబంధనలు పాటించటం లేదా?

తాజా వార్తలు

Published : 03/04/2020 20:44 IST

అమెరికన్లు కరోనా నిబంధనలు పాటించటం లేదా?

వాషింగ్టన్‌: నానాటికీ ఉద్ధృతమవుతున్న కరోనా కేసుల సంఖ్యతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు కుదేలవుతున్నాయి. 2,42,000 కేసులతో అమెరికా కరోనా వ్యాప్తిలో కూడా అగ్రరాజ్యంగా ఉంది. గత 24 గంటల్లో ఇక్కడ 30,000 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక ఆ దేశంలో కొవిడ్‌-19 కారణంగా ఇప్పటి వరకు 5,850 మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్లు భౌతిక దూరాన్ని పాటించటం లేదంటున్న శ్వేత సౌధ ఉన్నతాధికారి వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.

‘‘16 రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు కరోనా ఆంక్షలను సడలించారు. అనంతరం ఏమైందో మీరు చూస్తున్నారు. ఇప్పుడు కరోనా సోకి ఆస్పత్రులలో ఉన్నవారందరూ ఆంక్షలను రద్దుచేసిన అనంతరం కొవిడ్‌ సోకినవారే. (పెరుగుతున్న) కరోనా కేసుల సంఖ్యను బట్టి అందరు అమెరికన్‌ పౌరులు సామాజిక దూర నిబంధనను పాటించటం లేదని చెప్పగలను.’’ అంటూ అధ్యక్ష భవనం రెస్పాన్స్‌ కో-ఆర్డినేటర్‌ దెబోరా బిర్క్స్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటించాలనే నిబంధనలను మరో 30 రోజులపాటు పొడిగించారు. 

వైద్య సామగ్రి సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు కస్టమ్స్‌, సరిహద్దు రక్షణా దళాలకు మరిన్ని అధికారాలను ఇచ్చే బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేయనున్నారు. దేశంలో కరోనా వ్యాప్తిని మరింత సమర్ధంగా నిరోధించేందుకు... ఆస్పత్రులు కరోనా బాధితులకు వైద్య సేవలను అందించే సిబ్బందిని మార్చకుండా ఒకే వైద్య బృందాన్ని వినియోగించాలని కూడా ఆదేశాలు జారీఅయ్యాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని