‘9’ ప్రాముఖ్యతపై శశిథరూర్‌ ఆశ్చర్యం..!

తాజా వార్తలు

Published : 04/04/2020 13:45 IST

‘9’ ప్రాముఖ్యతపై శశిథరూర్‌ ఆశ్చర్యం..!

దిల్లీ: కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలవుతున్న సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి వీడియో సందేశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని చేసిన విన్నపంపై విపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి. ప్రధాని పేర్కొన్న ‘9’ అంకెపై కాంగ్రెస్‌ నేత, పార్లమెంట్‌ సభ్యుడు శశిథరూర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఇది అనుకోకుండా జరిగింది కాదు..  శ్రీరామనవమి రోజు ప్రధానమంత్రి ఇచ్చిన సందేశం ద్వారా హిందూయిజంలోని 9కి సంబంధించిన ప్రాముఖ్యాన్ని, గొప్పదనాన్ని వెల్లడించారు. ఇక శ్రీరాముడే రక్ష?. ఈ సమయంలో కరోనా మహమ్మారి మనం ఊహించిన దానికన్నా తీవ్రమైన విషయం’ అని థరూర్‌ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

శశిథరూర్‌ ట్వీట్‌పై పలువురు విమర్శలు గుప్పించారు. శ్రీరామనవమి గురువారంతోనే ముగిసిందని.. ప్రధాని ప్రసంగించిన రోజు దశమి అని పేర్కొన్నారు. దీంతో మరోసారి శశిథరూర్‌ ట్విటర్‌లో స్పందించారు . ‘లాక్‌డౌన్‌ అమలవుతున్న కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థికస్థితిపై ఆందోళనలపై ప్రధాని దృష్టిపెట్టలేదు. లాక్‌డౌన్‌ ముగిసిన అనంతరం ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు, భవిష్యత్‌ కార్యచరణపై దూరదృష్టి లేదు’ అని దుయ్యబట్టారు.

ఆదివారం రాత్రి 9 గంటలకు ఇంట్లోని అన్ని లైట్లను బంద్‌ చేసి.. ఇంటి గుమ్మం ముందో, బాల్కనీలోనో నిలబడి 9 నిమిషాలపాటు కొవ్వొత్తి, దీపం, టార్చ్‌ లేదంటే మొబైల్‌ ఫ్లాష్‌లైట్‌ రూపంలో వెలుగులు ప్రసరింపజేయండి. తద్వారా మనమంతా ఒక్కతాటిపై పోరాడుతున్నామన్న భావన అందరిలో ఉద్భవిస్తుంది’ అని శుక్రవారం ప్రధాని తన వీడియో సందేశంలో ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని