ఆహారం లభించే వివరాలు ఇక గూగుల్‌ మ్యాప్స్‌లో..

తాజా వార్తలు

Published : 06/04/2020 18:45 IST

ఆహారం లభించే వివరాలు ఇక గూగుల్‌ మ్యాప్స్‌లో..

దిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో చాలామంది సొంతూళ్లకు వెళ్లకుండా నగరాల్లోనే చిక్కుపోయారు. వారికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆహారం, బస కల్పిస్తున్నాయి. అయినప్పటికీ వీటిని పొందలేకపోతున్న వారికోసం టెక్‌ దిగ్గజం గూగుల్‌ సాంకేతిక సాయం అందజేస్తోంది. గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా 30 నగరాల్లో భోజనం, బస ఎక్కడ దొరుకుతాయో చూపించనుంది. సహాయ కేంద్రాల వివరాలు చూపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నామని ఆ సంస్థ తెలిపింది.

‘ఇప్పట్నుంచి మ్యాప్స్‌, సెర్చ్‌, గూగుల్‌ అసిస్టెంట్‌ ద్వారా దేశంలోని 30 నగరాల్లో సహాయ కేంద్రాల వివరాలు తెలుసుకోవచ్చు’ అని గూగుల్‌ తెలిపింది. ప్రజలు ‘ఫుడ్‌ షెల్టర్స్‌ ఇన్‌ <సిటీ నేమ్‌>’ లేదా ‘నైట్‌ షెల్టర్స్‌ ఇన్‌ <సిటీ నేమ్‌>’ అని టైప్‌ చేసి వివరాలు పొందొచ్చని వెల్లడించింది. త్వరలోనే ఈ సేవలు హిందీలోనూ అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. మరిన్ని నగరాలు, భారతీయ భాషల కోసం పని మొదలు పెట్టినట్టు వెల్లడించింది.

‘కొవిడ్‌-19తో విపత్కర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ కష్ట సమయంలో ప్రజలకు సాయం అందించేందుకు గూగుల్‌ దృష్టిసారించింది. స్మార్ట్‌ఫోన్‌ లేనివారికి ఆహారం, బస గురించి వాలంటీర్లు, ఎన్‌జీవోలు, ట్రాఫిక్‌ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు సాయపడాలని కోరుతున్నాం’ అని గూగుల్‌ ఇండియా సీనియర్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ అనాల్‌ ఘోష్‌ అన్నారు. ప్రస్తుతానికి ఏయే నగరాల్లో గూగుల్‌ సేవలు లభిస్తున్నాయో తెలియాల్సి ఉంది. చైనాలో మొదట వెలుగుచూసిన కరోనా వైరస్‌ వల్ల ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని