కరోనా ఎఫెక్ట్‌: రఫేల్‌ యుద్ధ విమానాల ఆలస్యం

తాజా వార్తలు

Published : 15/04/2020 14:28 IST

కరోనా ఎఫెక్ట్‌: రఫేల్‌ యుద్ధ విమానాల ఆలస్యం

మే నెలాఖరుకు భారత్‌కు రఫేల్‌ యుద్ధ విమానాలు

న్యూదిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా రఫేల్‌ యుద్ధవిమానాల రాక మరికొన్ని వారాలపాటు ఆలస్యం కానుందని భారతీయ వైమానిక దళ వర్గాలు వెల్లడించాయి. తొలుత కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొదటి బ్యాచ్‌ రఫేల్‌ విమానాలు మే చివరికల్లా భారత్‌కు చేరాల్సి ఉంది. కాగా, లాక్‌డౌన్‌ పూర్తయిన అనంతరం రఫేల్‌ విమానాల పంపిణీ తేదీలు ఖరారు అవుతాయని వైమానిక దళ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన ఈ విమానాలు అత్యాధునికమైనవి కావడంతో వీటికి సంబంధించి భారత వాయుసేన పైలట్లకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన నలుగురు పైలట్లు యుద్ధ విమానాలు నడపటంలో కీలక పాత్ర పోషిస్తారని ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ రాకేశ్‌కుమార్‌ సింగ్‌ భదౌరియా తెలిపారు. కాగా, 2016లో రూ.60,000 కోట్ల వ్యయంతో 36 రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం, దసాల్ట్‌ ఏవియేషన్‌తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని