వైద్యారోగ్య సిబ్బంది కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌

తాజా వార్తలు

Published : 15/04/2020 18:42 IST

వైద్యారోగ్య సిబ్బంది కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌

దిల్లీ: కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా దేశం కొనసాగిస్తున్న పోరులో వైద్యారోగ్య సిబ్బంది ముందు వరుసలో ఉండి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సైనికుల్లా పోరాడుతున్నారని కేంద్రం అభిప్రాయపడింది. విధి నిర్వహణలో వారికి ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు కేంద్రం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీం కోర్టుకు విన్నవించింది. వైద్యారోగ్య సిబ్బంది ఎప్పుడైనా ఆ నంబర్‌కు ఫోన్‌చేసి జీతాల కోత, నగదు చెల్లింపులో ఆలస్యం, రక్షణ తొడుగుల కొరత, అద్దె చెల్లింపు వసతి నుంచి తొలగించడం వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చిని తెలిపింది. 

కరోనా కట్టడిలో భాగంగా రోగులకు సేవలందిస్తున్న వైద్యారోగ్య సిబ్బందికి పొంచి ఉన్న ప్రమాదాలు, రక్షణ తొడుగుల కొరత, భద్రతకు సంబంధించి ‘నేషనల్ కొవిడ్‌-19 మేనేజ్‌మెంట్’ పేరుతో కేంద్రం ప్రత్యేక ప్రోటోకాల్ రూపొందించాలని కోరుతూ యునైటెడ్ నర్సెస్‌ అసోసియేషన్ (యుఎన్‌ఏ) సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, జస్టిస్ ఎస్‌.కె. కౌల్, జస్టిస్‌ బీ.ఆర్‌. గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. రక్షణ కిట్ల కొరత కారణంగా కరోనా సోకిన వారికి సేవలందిస్తున్న సుమారు 150 నుంచి 200 మంది నర్సులకు కరోనా సోకగా, 600 నుంచి 700 మంది వైద్యారోగ్య సిబ్బంది క్వారంటైన్‌లో ఉన్నారని పిటిషనర్ తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.   

కేంద్రం తరపున సొలిసిరేట్ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ కరోనాపై పోరులో వైద్యారోగ్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి సైనికుల్లా పోరాడుతున్నారని, వారి రక్షణ కోసం ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సిబ్బంది తమకున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసిన రెండు గంటల్లో పరిష్కారం అయ్యే విధంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఏర్పాటు చేస్తుందని కోర్టుకు తెలిపారు. 

ఇవీ చదవండి:

అతిపెద్ద స్మార్ట్‌ లాక్‌డౌన్‌ విధానం ఇదే

మీ ప్రాంతం హాట్‌స్పాట్‌ జాబితాలో ఉందా?


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని