పాకిస్థాన్‌ తీరు దురదృష్టకరం: భారత ఆర్మీ చీఫ్

తాజా వార్తలు

Published : 17/04/2020 14:36 IST

పాకిస్థాన్‌ తీరు దురదృష్టకరం: భారత ఆర్మీ చీఫ్

కుప్వారా(జమ్మూ కశ్మీర్): భారత్‌తో పాటు ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న సమయంలో పాకిస్థాన్‌ తీరు మాత్రం దురదృష్టకరమన్నారు భారత సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే. అత్యంత క్లిష్ట సమయంలో భారత్‌ పోరాడుతుంటే పాక్‌ మాత్రం భారత్‌కు ఉగ్రవాదులను తరలిస్తోందన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు స్వదేశంతో పాటు ప్రపంచ దేశాలకు మందులు, వైద్య సిబ్బందిని పంపిస్తుంటే.. పాకిస్థాన్‌ మాత్రం భారత్‌కు ఉగ్రవాదులను పంపించడంలో నిమగ్నమైందన్నారు. ప్రపంచమే అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో భారత్‌పై పాక్‌ ఉగ్రదాడులకు పాల్పడటాన్ని సహించబోమని జనరల్‌ నరవణే పాక్‌ను మరోసారి హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నరవణే మాట్లాడుతూ... ‘‘మనం మన దేశ ప్రజలకే కాకుండా ప్రపంచం మొత్తానికి వైద్య బృందాలను, ఔషధాలను పంపుతూ బిజీగా ఉన్నాం. అయితే మరోవైపు, పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని మాత్రమే ఎగుమతి చేస్తోంది. ఇది సరైన పద్ధతి కాదు... ’’ అని ఆర్మీ ఛీప్‌ వివరించారు. 

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్‌ తరచూ భారత్‌పై దాడులు జరుపుతోంది. ఈ సందర్భంలో నియంత్రణ రేఖ వద్ద పాక్‌ నిర్వహిస్తోన్న ఉగ్రక్షేత్రాలపై గతవారం భారత సైన్యం దాడులు జరిపింది. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. తాజాగా నియంత్రణ రేఖ సమీపంలోని కెరణ్ సెక్టార్‌ను సైన్యాధిపతి జనరల్‌ నరవణే సందర్శించారు. లాక్‌డౌన్‌ కాలంలో సైన్యాధిపతి ఈ ప్రదేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. పాకిస్థాన్‌ చేస్తున్న ఈ ఉగ్ర ప్రయత్నాలను చాటిచెప్పే వీడియోను తాజాగా భారత ఆర్మీ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..

కరోనాపై పోరుకు ఆర్మీ ‘ఆపరేషన్‌ నమస్తే’

ఉగ్రమూలాలపై దాడులు..పాక్‌ కు హెచ్చరిక


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని