ఒక వర్గాన్ని నిందించడం తగదు: నఖ్వీ

తాజా వార్తలు

Published : 23/04/2020 22:57 IST

ఒక వర్గాన్ని నిందించడం తగదు: నఖ్వీ

దిల్లీ: ఒక వ్యక్తి, ఒక సమూహం చేసిన పొరపాటుకు మొత్తం ఒక వర్గాన్ని తప్పుబట్టడం సరికాదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు. దేశంలో కొవిడ్‌-19 కేసుల పెరుగుదలకు తబ్లిగీ జమాత్‌ సమ్మేళనం కారణమంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

ఒక సంస్థ చేసిన తప్పునకు ఆ వర్గం మొత్తాన్ని నిందించడం సరికాదని నఖ్వీ అన్నారు. ఆ సంస్థ చేసిన నిర్లక్ష్యం, నేరం ఏదైనా సరే అది మొత్తం వర్గానికి ఆపాదించడం సరికాదన్నారు. ఆ మతానికి చెందిన వారే కొందరు వారి చర్యను తప్పుబట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారని నఖ్వీ గుర్తుచేశారు. 

కొవిడ్‌ విస్తరిస్తున్న వేళ లాక్‌డౌన్‌ నిబంధనలకు లోబడి రంజాన్‌ మాసాన్ని ముస్లింలు జరుపుకొంటారని నఖ్వీ తెలిపారు. రంజాన్‌ నెలలో ఇంట్లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న ఇమామ్‌లు, ఉలేమాలు, ముస్లిం సంస్థల ప్రతినిధులు ఇప్పటికే ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రాల వక్ఫ్‌బోర్డు అధికారులతోనూ, మత పెద్దలతోనూ తాను మాట్లాడానని తెలిపారు. కొవిడ్‌పై పోరులో ప్రతిపక్ష పార్టీల పాత్ర గురించి అడగ్గా.. కొందరు ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటారని, అది వారి అలవాటని అన్నారు. వాటి గురించి పట్టించుకోనక్కర్లేదని నఖ్వీ చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని