భారతీయులను రక్షిస్తోన్న శక్తి అదే!: చైనా
close

తాజా వార్తలు

Updated : 25/04/2020 16:20 IST

భారతీయులను రక్షిస్తోన్న శక్తి అదే!: చైనా

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారిని తట్టుకునే శారీరక శక్తి(రోగనిరోధక శక్తి) భారతీయులకు లేకున్నా వారి మానసిక శక్తే వారిని రక్షిస్తుందని చైనా వైద్య నిపుణులు అంటున్నారు. తాజాగా చైనాలోని ప్రముఖ వైద్య నిపుణుడు ఝాంగ్‌ వెన్‌హాంగ్‌ భారత్‌లో ఉన్న చైనా విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చటించారు. ఈ సందర్భంలో ‘భారత్‌లో మాస్కుల్లేకుండా ప్రజలు ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం చూశాను. కొవిడ్‌-19ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి లేకున్నా మానసిక స్థైర్యం భారతీయులకు ఉంది’ అని విద్యార్థులతో అన్నారు.

ప్రస్తుతం షాంఘై లోని హౌషన్‌ ఆసుపత్రిలో అంటువ్యాధుల విభాగానికి డైరక్టర్‌గా ఉన్న ఝాంగ్‌..భారతీయులు ప్రశాంతత మనస్తత్వం కలిగిన వారని, అందుకే కరోనా వైరస్‌ను దీటుగా ఎదుర్కోగలరనే అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అమెరికాతో పోలిస్తే చాలా తక్కువే అని స్పష్టం చేశారు. అత్యధిక జనాభా కలిగిన దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తక్కువే అన్నారు. భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి 10శాతం కూడా మించదని...మీ చుట్టూ ఉండే 90శాతం మంది వైరస్‌ సోకనివారేనని భారత్‌లో ఉన్న చైనా విద్యార్థులకు భరోసా ఇచ్చారు.

శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 23వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 718మంది మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు 27లక్షల మంది ఈ వైరస్‌ బారినపడగా లక్షా 90వేల మంది మృత్యువాతపడ్డారు.

ఇవీ చదవండి..

చైనాలో 2,32,000 కరోనా కేసులు!

చైనా నవంబరులోనే వైరస్‌ గుర్తించిందా?Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని