జూలో పులి మృతి..కరోనా టెస్టుకు శాంపిల్స్‌

తాజా వార్తలు

Updated : 24/04/2020 22:31 IST

జూలో పులి మృతి..కరోనా టెస్టుకు శాంపిల్స్‌

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని జంతు ప్రదర్శనశాలలో ఓ ఆడ పులి కిడ్నీ ఫెయిల్‌ అవ్వడంతో మరణించింది. జంతువులకూ కరోనా వచ్చే ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దాని నమూనాలను కరోనా పరీక్షలకు పంపించారు జూ అధికారులు. కల్పన అనే 14 ఏళ్ల ఆడ పులి బుధవారం మరణించింది. గురువారం అధికారుల సమక్షంలో ఖననం చేశారు. క్రియాటినిన్‌ స్థాయిలు పెరగడం (కిడ్నీ ఫెయిల్‌ అయినప్పుడు జరుగుతుంది) వల్లే మరణించిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అనంతరం పులికి సంబంధించిన నమూనాలను యూపీలోని బరేలీలో ఉన్న ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినట్లు జూ అధికారులు వెల్లడించారు.

అమెరికాలోని జూలో ఓ పులికి కేర్‌ టేకర్‌ ద్వారా కరోనా వ్యాపించిన నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. మనుషుల నుంచి జంతువులకు కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర పర్యావరణ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అనుమానముంటే ప్రతి 15 రోజులకోసారి నమూనాలను సేకకరించాలని సెంట్రల్‌ జూ అథారిటీ అన్ని జంతు ప్రదర్శశాలలకు సూచించింది. ఈ నేపథ్యంలో పులి మరణించడంతో దానికి కరోనా సోకిందేమోనన్న అనుమానంతో పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ అని తేలింది.

ఇదీ చదవండి..
అమెరికాలో పులికి కరోనా: భారత్‌లో అప్రమత్తత


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని