వలస కార్మికులకు ఉపాధి శిక్షణ

తాజా వార్తలు

Published : 27/04/2020 23:45 IST

వలస కార్మికులకు ఉపాధి శిక్షణ

హరియాణాలో వినూత్న కార్యక్రమం

హిసార్‌: హరియాణాలోని హిసార్‌లో ఆశ్రయం పొందుతున్న వలస కార్మికులకు అధికారులు ఉపాధి శిక్షణ అందిస్తున్నారు. నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో భాగంగా 87 మందికి ఏసీ రిపేరింగ్, వడ్రంగి, ప్లంబింగ్‌ తదితర పనుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హిసార్‌ డిప్యూటీ కమిషనర్‌ ప్రియాంక సోని సోమవారం శిక్షణ కేంద్రాన్ని సందర్శించి కార్మికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘వలస కార్మికులకు యోగా తరగతులు నిర్వహిస్తున్నాం. భోజనం, మంచినీటి సదుపాయం కల్పించి టీవీ, దినపత్రికలను అందుబాటులో ఉంచాం. పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) నిపుణుల సహాయంతో వారికి ఏసీ రిపేరింగ్, వడ్రంగి తదితర పనులు నేర్పిస్తున్నాం. ఈ శిక్షణ కూలీల జీవన ప్రమాణాలను పెంచుతుందని ఆశిస్తున్నాం. వైరస్‌ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ప్రతి ఒక్కరికి సూచించాం’ అని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. కొందరు స్వస్థలాలకు వెళ్లేందుకు యత్నించగా.. మార్గమధ్యలో వారిని అడ్డుకుని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని