పరీక్షల సమయం రెండు గంటలకు కుదింపు 

తాజా వార్తలు

Published : 01/05/2020 01:27 IST

పరీక్షల సమయం రెండు గంటలకు కుదింపు 


హైదరాబాద్‌ : కొవిడ్‌-19 పరిస్థితిని బట్టి విశ్వవిద్యాలయాలు సెమిస్టర్‌ పరీక్షలను జులైలో ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్ (యూజీసీ) సూచించింది. పరీక్షల సమయాన్ని మూడు గంటల నుంచి రెండు గంటలకు కుదించాలని సిఫార్సు చేసింది. ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలను జులైలో నిర్వహించాలని స్పష్టం చేసింది. మధ్యంతర సెమిస్టర్‌ విద్యార్థులకు మాత్రం అంతర్గత మదింపు లేదా వైరస్‌ పరిస్థితి సాధారణంగా మారిన రాష్ట్రాల్లో జులైలోనే నిర్వహించాలని పేర్కొంది. అందుబాటులో ఉన్న వ్యవస్థలను బట్టి పరీక్షలను ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌లో ఏది ఉత్తమమైందో ఆయా విశ్వవిద్యాలయాలే నిర్ణయించుకోవాలని సూచించింది. అంతర్గత మదింపు ద్వారా ఫలితాలు నిర్దేశిస్తే మెరుగైన గ్రేడ్‌ కావాలని కోరుకునే విద్యార్థులు తదుపరి సెమిస్టర్‌లో నిర్వహించే ప్రత్యేక పరీక్షలు రాయాల్సిందిగా వెల్లడించింది. కొత్తగా చేరిన విద్యార్థులకు సెప్టెంబరు నుంచి, పాత విద్యార్థులకు ఆగస్టు నుంచి బోధనా తరగతులు ప్రారంభించాలని మార్గదర్శకాలు జారీ చేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని