పాక్‌ స్పీకర్‌కు కరోనా పాజిటివ్‌

తాజా వార్తలు

Published : 01/05/2020 15:16 IST

పాక్‌ స్పీకర్‌కు కరోనా పాజిటివ్‌

నిబంధనల ఉల్లంఘనే కారణం!

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీ స్పీకర్‌ అసద్‌ ఖైజర్‌కు కరోనా వైరస్‌ సోకినట్లు శుక్రవారం నిర్ధారణ అయ్యింది. ఆయనతో పాటు కూతురు, కొడుకు కూడా వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు ఆయన సోదరుడు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్పీకర్‌ ఇటీవల తన ఇంట్లో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. దీంట్లో పాల్గొన్న ఆయన బావ, చెల్లికి వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అంతా అప్రమత్తమయ్యారు. విందులో పాల్గొన్న వారంతా పరీక్షలు చేయించుకోగా.. స్పీకర్‌ సహా ఆయన కొడుకు, కూతురుకు వైరస్‌ సోకిన విషయం బయటపడింది.

ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌ పాకిస్థాన్‌లోనూ విజృంభిస్తోంది. గురువారం అత్యధికంగా 990 మందికి వైరస్‌ సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఒక్కరోజు వ్యవధిలో 24 మంది మృతిచెందినట్లు తెలిపింది. దీంతో అక్కడ మృతుల సంఖ్య 385కు పెరిగింది. ఇక పాజిటివ్‌ కేసుల సంఖ్య 16,817కు చేరింది. పాక్‌లో వైరస్ సోకిన ఉన్నతస్థాయి నాయకుల్లో స్పీకర్‌ అసద్‌ ఖైజర్‌ రెండోవారు. ఇంతకుముందు సింధ్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ కూడా వైరస్‌ బారినపడ్డారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని