చైనాలో కొత్తగా 14 కరోనా పాజిటివ్‌ కేసులు

తాజా వార్తలు

Published : 03/05/2020 18:59 IST

చైనాలో కొత్తగా 14 కరోనా పాజిటివ్‌ కేసులు

బీజింగ్‌: కరోనా పుట్టుకకు కేంద్రంగా భావిస్తున్న చైనాలో ఆదివారం కొత్తగా 14 కరోనా కేసులు నమోదయినట్లు అక్కడి ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే వీరిలో 12 మందికి వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం ఆందోళన కలిస్తోందని పేర్కొన్నారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు విదేశాల నుంచి రాగా, మరొకరికి స్థానికంగా వైరస్‌ సంక్రమించినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. దీంతో చైనాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,877కు చేరుకుంది. అలానే 4,633 మంది కరోనా బారినపడి మృతి చెందారు. ఇప్పటి వరకు 1,672 మంది కరోనా లక్షణాలతో విదేశాల నుంచి రాగా, వారిలో 451 మంది చైనాకు చెందిన వారని, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎన్‌హెచ్‌సీ తెలిపింది. శనివారం కొత్తగా 12 మందికి వైరస్‌ సోకగా వారిలో ఎలాంటి లక్షణాలు లేవని.. మొత్తంగా ఇలాంటి కేసుల సంఖ్య 968 కాగా, వారిలో 98 మంది విదేశాల నుంచి వచ్చిన వారని తెలిపారు. ప్రస్తుతం వీరంతా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించారు. 

ఏప్రిల్ 26న హుబేయ్‌ ప్రావిన్స్‌లో కరోనా కేసులు లేవని ప్రకటించారు. అయితే శనివారం నాటికి అక్కడ 651 కేసులు నమోదుకాగా... వారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని తెలిపారు. కరోనా లక్షణాలు లేకుండా కేసులు నమోదవుతుండటం వైరస్‌ వ్యాప్తిపై ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఇప్పటికే చైనా ప్రభుత్వం విదేశాల నుంచి ఎవ్వరూ రాకుండా ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ విమానాల సంఖ్యను తగ్గించింది. చైనాలోని వుహాన్‌లో తొలి కరోనా కేసు నమోదు కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34 లక్షల మందికి సోకింది. అలానే ఈ మహమ్మారి బారినపడి 2,43,829 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇవీ చదవండి...

కరోనా మరణాల రేటు భారత్‌లోనే తక్కువ!

వారి త్యాగాలు మరువలేం: ఎన్‌కౌంటర్‌పై ప్రధాని


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని