దేశంలో 40వేలు దాటిన పాజిటివ్‌ కేసులు!

తాజా వార్తలు

Published : 03/05/2020 19:20 IST

దేశంలో 40వేలు దాటిన పాజిటివ్‌ కేసులు!

ఒక్కరోజులోనే 83 మంది మృతి

దిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగింది. గడిచిన 24 గంటల్లో (మే 3 సాయంత్రం 5 గంటల వరకు) కొత్తగా 2,487 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఒక్క రోజులో గరిష్ఠ పెరుగుదల ఇదే కావడం గమనార్హం. మరోవైపు ఒక్కరోజులోనే 83 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40,263కు చేరగా.. మరణాల సంఖ్య 1,306కు చేరినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 10,886 మంది ఈ వైరస్‌ బారి నుంచి కోలుకున్నారని, 28,070 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.

ఒక్క మహారాష్ట్రలోనే 12వేలు

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్రం లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 12,296 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. 521 మంది ప్రాణాలు కోల్పోయారు. 2 వేల మంది కోలుకున్నారు. ముంబయి నగరంలోనే ఎక్కువగా కేసులు నమోదవుతుండడం గమనార్హం. గుజరాత్‌లో సైతం కరోనా విజృంభణ తగ్గడం లేదు. మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. ఇప్పటికే గుజరాత్‌లో కేసుల సంఖ్య 5 వేలు దాటింది. 262 మంది మరణించారు. 896 మంది కోలుకున్నారు. దిల్లీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, యూపీ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య వెయ్యి దాటింది.

రాష్ట్రాల వారీగా కేసుల వివరాలు..

ఇవీ చదవండి..
శ్రామిక్‌ రైళ్లకు 90 శాతం ఆక్యుపెన్సీ ఉండాల్సిందే
కరోనా ఎఫెక్ట్‌: ఫస్ట్‌నైట్‌.. జస్ట్‌ వెయిట్‌!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని