లాక్‌డౌన్‌ సడలింపు వారికి మాత్రమే: హోంశాఖ

తాజా వార్తలు

Published : 04/05/2020 01:18 IST

లాక్‌డౌన్‌ సడలింపు వారికి మాత్రమే: హోంశాఖ

దిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరవేసేందుకు అనుమతిస్తూ కేంద్రం ప్రత్యేక రైళ్లు నడపునున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రైళ్లలో ప్రయాణించేందుకు లక్షలాది మంది కూలీలు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు సాధారణ ప్రజలు కూడా స్వస్థలాలకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. లాక్‌డౌన్‌కు ముందు ఉపాధి కోసం, ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా అక్కడ చిక్కుకుపోయిన వలస కార్మికులు, ఉద్యోగులకు మాత్రమే ఇతర రాష్ట్రాల్లోని తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయమై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని