కరోనా ఎఫెక్ట్‌: సివిల్స్‌ ప్రిలిమ్స్‌ వాయిదా
close

తాజా వార్తలు

Published : 04/05/2020 23:10 IST

కరోనా ఎఫెక్ట్‌: సివిల్స్‌ ప్రిలిమ్స్‌ వాయిదా

దిల్లీ: మే 31న జరగాల్సిన సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్పీ) నిర్ణయించింది. కేంద్రప్రభుత్వం కరోనా వైరస్ లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించిన నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు అధికారులు వివరించారు. ఈ రోజు నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో... కొవిడ్‌-19 మహమ్మారి అంతకంతకు విస్తరిస్తున్న పరిస్థితుల్లో ఈ పరీక్షను నిర్వహించటం సరికాదనే నిర్ణయానికి వచ్చారు.  

పరీక్ష కేంద్రాలుగా ఉపయోగించే పాఠశాలలు, కళాశాలలను క్వారంటైన్‌ కేంద్రాలుగా మార్చిన నేపథ్యంలో... కొత్త తేదీలను మే 20 తర్వాత ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ అనంతరం అభ్యర్ధులు పరీక్షా కేంద్రాలు చేరుకునేందుకు రిజర్వేషన్ల లభ్యత తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని కొత్త తేదీలను ప్రకటిస్తామని అధికారులు వివరించారు. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ను ప్రతి సంవత్సరం సుమారు పది లక్షల మంది హాజరవుతారు. ఈ సంవత్సరం పరీక్షల నిర్వహణ ప్రక్రియ కాస్త ఆలస్యం అవుతుందని... అయితే అభ్యర్థులు ఆందోళన చెందనవసరం లేదని యూపీఎస్పీ చైర్మన్‌ విజయ్‌ సింగ్‌ అన్నారు. అందరికీ అనువుగా ఉండేలా కొత్త తేదీలను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని