భారత్‌: 50వేలకు చేరువలో కరోనా కేసులు!

తాజా వార్తలు

Published : 06/05/2020 10:33 IST

భారత్‌: 50వేలకు చేరువలో కరోనా కేసులు!

దిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత మూడురోజులుగా దేశంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.  గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2958 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా మరో 126మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య బుధవారం ఉదయానికి 49,391కు చేరగా 1694మంది మృత్యువాతపడ్డట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 14,183మంది కోలుకోగా మరో 33,514 మంది చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో 15వేలు, గుజరాత్‌లో 6వేలు..

మహారాష్ట్రలో కొవిడ్‌-19 విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 984కొత్త కేసులు, 34మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,525కి చేరగా 617మంది మృత్యువాతపడ్డారు. ముంబయి మహానగరంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక గుజరాత్‌లో ఒకేరోజు అత్యధికంగా 441కేసులు నిర్ధారణ అవడంతోపాటు నిన్న ఒక్కరోజే 49మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6245కి చేరగా ఇప్పటివరకు 368మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని దిల్లీలోనూ ఒకేరోజు 206 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దిల్లీలో ఈ వైరస్‌ బారినపడినవారి సంఖ్య 5104కి చేరగా 64మంది మరణించారు. తమిళనాడులో గత రెండు రోజులుగా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. కేవలం నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 508కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4058కి చేరగా 33మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోనూ కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 3049 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా ఇప్పటివరకు 176మంది మరణించారు.

ఆంధ్రప్రదేశ్‌లో 1717, తెలంగాణలో 1096..

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌-19 తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న ఒక్కరోజే 67పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 1717కి చేరింది. వీరిలో 34మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకినవారిలో 589మంది కోలుకున్నారు. ఇక తెలంగాణలో నిన్న కొత్తగా 11 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1096కి చేరగా 29మంది చనిపోయారు.

ఇవీ చదవండి..

రోగ నిరోధక శక్తే బ్రహ్మాస్త్రం

ఉద్యోగమో..రామచంద్రా!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని