పౌరవిమానయాన శాఖ వెబ్‌సైట్‌ క్రాష్‌!
close

తాజా వార్తలు

Published : 06/05/2020 18:46 IST

పౌరవిమానయాన శాఖ వెబ్‌సైట్‌ క్రాష్‌!

దిల్లీ: కరోనావైరస్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా పౌరవిమానయాన శాఖ వెబ్‌సైట్‌కు భారీ రద్దీ పెరిగింది. విమానాల సమాచారం కోసం విదేశాల్లో ఉన్న వారు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించారు. దీంతో ఒక్కసారిగా రద్దీ పెరిగి వైబ్‌సైట్‌ క్రాష్‌ అయినట్లు అధికారులు ప్రకటించారు. వెబ్‌సైట్‌ను పునరుద్ధరించేందుకు ఎన్‌ఐసీ విభాగం పనిచేస్తోందని విమానయాన మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో ప్రకటించింది. విదేశాల నుంచి భారతీయులను తరలించేందుకు ఏర్పాటు చేసిన విమాన వివరాలను ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. విదేశాల్లో ఉన్న దాదాపు 15వేల మందిని తరలించేందుకు భారత ప్రభుత్వం 64విమానాలు సిద్ధం చేసింది. స్వదేశానికి ఈ తరలింపు ప్రక్రియ దాదాపు వారం రోజులపాటు సాగనుంది.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని