‘ద్వేషానికి ముగింపు పలకాల్సిందే..’

తాజా వార్తలు

Published : 08/05/2020 13:10 IST

‘ద్వేషానికి ముగింపు పలకాల్సిందే..’

న్యూయార్క్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో కొన్ని ప్రాంతాల్లో వ్యక్తమవుతోన్న ద్వేషాభావానికి ముగింపు పలకాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌‌ పిలుపునిచ్చారు. ఈ వైరస్‌ విస్తృతంగా వ్యాప్తిస్తున్న సమయంలో కొన్ని దేశాల్లో విదేశీయుల పట్ల విద్వేషం, చిన్నచూపు చూస్తున్న నేపథ్యంలో గుటెరస్‌ ఈ ప్రకటన చేశారు. ‘కరోనా వైరస్‌ వ్యాప్తికి కొన్ని దేశాలనుంచి వలసవచ్చిన వారిని, నిరాశ్రయులను వేలెత్తి చూపుతున్న ఘటనలు చూస్తున్నాం. ఈ నెపంతో వారికి వైద్య సేవలు అందించడానికి కూడా నిరాకరిస్తున్నారు.’ అని గుటెరస్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా కరోనా వైరస్‌కు గురవుతున్న వృద్ధులను కూడా చిన్నచూపు చూసే నీచమైన ప్రక్రియ మొదలైందని..ఇది ఎంత మాత్రం సహించకూడదని గుటెరస్‌ అన్నారు. వీరితోపాటు ఆపత్కాలంలో విధులు నిర్వర్తిస్తోన్న జర్నలిస్టులు, వైద్య సిబ్బంది, ఆరోగ్యకార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో వ్యక్తమవుతోన్న ద్వేషపూరిత వాతావరణానికి ముగింపు పలకాలని యూఎన్‌ చీఫ్ కోరారు. ఇలాంటి సమయంలో సామాజిక మాధ్యమాల్లో జాత్యాహంకారం, మహిళా వ్యతిరేక భావనలతోపాటు ఇతర హానికర సమాచారాన్ని తొలగించేందుకు ఆయా సంస్థలు కృషి చేయాలని‌ సూచించారు.

ఇవీ చదవండి..

సాధారణ పరిస్థితులు రావాలంటే..

చైనాను పొగిడిన కిమ్‌..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని