అజిత్ జోగికి తీవ్ర అస్వస్థత

తాజా వార్తలు

Published : 09/05/2020 15:15 IST

అజిత్ జోగికి తీవ్ర అస్వస్థత

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి(74) శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన తన గార్డెన్‌లో కుప్పకూలిపోవడంతో వెంటనే ఆయన్ను రాయ్‌పూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుండెపోటు కారణంగా అస్వస్థతకు గురైనట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో, వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని మెడికల్ బులెటిన్‌లో పేర్కొన్నారు.  2000 నుంచి 2003 మధ్య జోగి చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొదట కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆయన తరవాత తన కుమారుడు అమిత్‌తో కలిసి జనతా కాంగ్రెస్‌ చత్తీస్‌గఢ్‌ అనే రాజకీయపార్టీని స్థాపించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని