లండన్‌ నుంచి భారత్‌ చేరుకున్న 326 మంది
close

తాజా వార్తలు

Published : 10/05/2020 09:12 IST

లండన్‌ నుంచి భారత్‌ చేరుకున్న 326 మంది

ముంబయి: కరోనా వైరస్‌ కట్టడి కోసం విధించిన ఆంక్షల నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన వందే భారత్‌ మిషన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా బ్రిటన్‌ రాజధాని లండన్‌ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం ముంబయికి చేరుకుంది. ఆదివారం వేకువజామున ఛత్రపతి శివాజీ విమానాశ్రయానికి చేరుకున్న ఎయిరిండియా 130, బోయింగ్‌ 777 విమానం.. 326 మంది భారతీయుల్ని స్వదేశానికి చేర్చింది. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు ఎయిరిండియా సిబ్బందికి, ప్రభుత్వానికి ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. 

ప్రస్తుతం భారత్‌ చేరుకున్న వారికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ఏమాత్రం లక్షణాలు ఉన్నా ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలిస్తామని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. మిగిలిన వారిని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచనున్నామన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని వారి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తామన్నారు. అంతకుముందు, 163 మందితో కూడిన ఎయిరిండియా విమానం కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అలాగే కువైట్‌, ఒమన్‌, మస్కట్‌ నుంచి రెండు విమానాలు నిన్న సాయంత్రం కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని