కోమాలోకి మాజీ ముఖ్యమంత్రి!

తాజా వార్తలు

Published : 10/05/2020 16:19 IST

కోమాలోకి మాజీ ముఖ్యమంత్రి!

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శనివారం గుండెపోటు రావడంతో రాయ్‌పూర్‌లోని శ్రీనారాయణ ఆసుపత్రిలో చేర్పించారు. అజిత్‌ జోగి ఆరోగ్య పరిస్థితి విషమించిందని..ప్రస్తుతం కోమాలోకి వెళ్లినట్లు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వైద్యులు పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేరిన అనంతరం జోగికి 8మందితో కూడిన ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స అందిస్తున్నారు. శ్వాసవ్యవస్థలో తలెత్తిన ఇబ్బందులతో మెదడుకు ఆక్సిజన్‌ అందడం లేదని, దీంతో కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని..మందులకు అతని శరీరం ఎలా స్పందిస్తోందన్న విషయం తెలియడానికి మరో 48గంటలు పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అజిత్‌ జోగి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని