వారిని బస్సులు, రైళ్లలోనే పంపించండి..

తాజా వార్తలు

Updated : 11/05/2020 11:22 IST

వారిని బస్సులు, రైళ్లలోనే పంపించండి..

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. దీనికి సంబంధించి కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు.

* వివిధ రాష్ట్రాల నుంచి వారి స్వస్థలాలకు వెళుతున్న వలస కార్మికులను రోడ్డు, రైలు పట్టాల ద్వారా నడవనీయకుండా ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి.

* వీరందరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులు, శ్రామిక్‌ రైళ్ల ద్వారానే పంపించే ఏర్పాట్లు చేయాలి.

*రైళ్లలో ప్రయాణించే వరకూ కూలీల కోసం ఏర్పాటు చేసిన క్యాంపులు కొనసాగించడంతోపాటు నీరు, ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించాలి.

* ఇతర రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వచ్చేందుకు కూలీలకు అవకాశం కల్పించాలి.

మెడికల్, పారిశుధ్య సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రైవేటు క్లినిక్ లు తెరిచే విషయాలపై అజయ్ భల్లా రాష్ట్రాలకు మరో లేఖ రాశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని