విషమించిన అజిత్ జోగి ఆరోగ్యం

తాజా వార్తలు

Published : 12/05/2020 19:27 IST

విషమించిన అజిత్ జోగి ఆరోగ్యం

ఆడియో థెరపీ అందిస్తోన్న వైద్యులు

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి(74) ఆరోగ్యం విషమించిందని, ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్నామని మంగళవారం వైద్యులు వెల్లడించారు. నాడీ వ్యవస్థ పనితీరు పూర్తిగా పడిపోయిందని, ఆయన కోమాలోనే ఉన్నారని తెలిపారు. గుండెనొప్పి, శ్వాస సంబంధ సమస్యలతో మే 9న జోగి రాయ్‌పూర్‌లోని శ్రీ నారాయణ ఆసుపత్రిలో చేరారు. 

‘జోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారు’ అని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్‌ డాక్టర్‌ సునీల్ ఖేమ్కా వెల్లడించారు. ‘ఆయన నాడీ వ్యవస్థ పనితీరు పూర్తిగా నిలిచిపోయింది. మెదడు పనితీరును మెరుగుపరచడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఇయర్ ఫోన్స్‌ ద్వారా ఆయనకు ఇష్టమైన పాటలు వినిపిస్తున్నాం. కానీ ఇంతవరకు ఏ ప్రయోజనం లేదు. గుండె పనితీరు, బీపీ అంతా సరిగానే ఉంది’ అని ఖేమ్కా తెలిపారు.  అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ ఆసుపత్రిలోని నర్సులందరు జోగి కోలుకోవాలని ప్రార్థనలు నిర్వహించినట్లు చెప్పారు. 2000 నుంచి 2003 మధ్య  రాష్ట్రానికి ఆయన మొదటి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. 2016లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌ పార్టీని స్థాపించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని