ఆ దేశాలతో పోలిస్తే తక్కువే..! నీతిఆయోగ్‌ సీఈఓ

తాజా వార్తలు

Updated : 19/05/2020 13:06 IST

ఆ దేశాలతో పోలిస్తే తక్కువే..! నీతిఆయోగ్‌ సీఈఓ

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య లక్ష దాటిన నేపథ్యంలో నీతిఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ స్పందించారు. కేసుల సంఖ్య ఎన్ని ఉన్నాయన్నది ముఖ్యం కాదని.. వీటితో సంభవించే మరణాలు, కోలుకుంటున్నవారి శాతమే కీలకమని వ్యాఖ్యానించారు. ఈ రెండింటిలోనూ భారత్‌ మెరుగైన ఫలితాలతో ముందుకు వెళ్తోందన్నారు. అమెరికాలో ప్రతి పదిలక్షల మందికి.. 275 మంది కరోనా సోకి ప్రాణాలు కోల్పోతుండగా.. స్పెయిన్‌లో 591మంది మరణిస్తున్నారని గుర్తుచేశారు. వీటితో పోలిస్తే భారత్‌లో ప్రతి పదిలక్షల జనాభాకు ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారని తెలియజేశారు. కొవిడ్‌-19 మరణాల రేటు ఫ్రాన్స్‌లో 16శాతం ఉండగా భారత్‌లో ఇది మూడు శాతం ఉందన్నారు. అంతేకాకుండా భారత్‌లో ఈ వైరస్‌ బారినపడి కోలుకుంటున్నవారి శాతం క్రమంగా పెరుగుతోందని.. ప్రస్తుతం ఇది 38శాతంగా ఉందని అమితాబ్‌ కాంత్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

భారత్‌లో నమోదవుతున్న 70శాతం కేసులు కేవలం 19జిల్లాల్లోనే నమోదవుతున్నాయని అమితాబ్‌కాంత్‌ వెల్లడించారు. వీటిలో తెలంగాణ నుంచి హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి కర్నూల్‌ జిల్లాలు ఉన్నాయి. దేశంలో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో 50శాతానికి పైగా ముంబయి, దిల్లీ, అహ్మదాబాద్‌, చెన్నై, థానే నగరాల్లోనే నమోదవుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో అత్యధిక తీవత్ర ముంబయి నగరంలో కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో కార్మికశక్తి అధికంగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు స్థానికంగానే కొత్త ఉద్యోగాల కల్పన కోసం వీలైనంత తొందరగా భారీ సంస్కరణలు చేపట్టాలని నీతిఆయోగ్‌ సీఈఓ సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని