వలస కూలీల కష్టాలు..వివాదంలో నటుడు

తాజా వార్తలు

Updated : 19/05/2020 20:24 IST

వలస కూలీల కష్టాలు..వివాదంలో నటుడు

గోరఖ్‌‌పూర్: ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు సొంతూళ్లకు చేరుకోవడానికి కష్టాలు పడుతున్న తరుణంలో గోరఖ్‌‌పూర్ ఎంపీ, భోజ్‌పురి నటుడు రవికిషన్‌కు సంబంధించిన ఓ వీడియోపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఆయన పేదలకు, కూలీలకు వ్యతిరేకి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాయి. రవికిషన్‌ కూలీల చెమట వాసన మీద విసుగు చూపిస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోందని మండిపడ్డాయి. 

‘రవికిషన్ విలాసంగా జీవిస్తారు. భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించే వలస కూలీల చెమట అంటే ఆయనకు గిట్టదు’ అని సమాజ్ వాదీ పార్టీ నేత ప్రహ్లాద్ యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విధమైన విమర్శలే చేసింది. అయితే ఈ వివాదంపై రవికిషన్ స్పందించారు. ఆ వీడియో 2017లో యూపీ ఎన్నికల నాటిదని చెప్పారు. ‘భాజపా ప్రభుత్వం గొప్ప పనితీరుతో విసుగు చెందిన విపక్ష పార్టీలు ఈ వీడియోను వైరల్ చేసి, వివాదం చేస్తున్నాయి. దానిలో నా మాటలకు తప్పుడు అర్థం ఆపాదిస్తున్నారు. వారికి భోజ్‌పురి సరిగా అర్థం కాలేదు. పేదలకు నేను ఎంత గౌరవం ఇస్తానో నా గురించి తెలిసిన వారికి తెలుసు. వారికి నేనేం చేశానో తెలుసు. నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. కార్మికుల చెమట విలువ నాకు తెలుసు’ అని ఆయన విమర్శలకు దీటుగా బదులిచ్చారు. 

ఇవీ చదవండి:

పెళ్లి డబ్బులతో కూలీల ఆకలి తీర్చి..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని