కరోనాకు హైడ్రాక్సీ వాడకం... ఓకేనా?

తాజా వార్తలు

Published : 22/05/2020 01:42 IST

కరోనాకు హైడ్రాక్సీ వాడకం... ఓకేనా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరిక 

జెనీవా: మహమ్మారి కరోనా వైరస్‌ చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, క్లోరోక్విన్‌ ఔషధాల వాడకాన్ని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య హెచ్చరికలు జారీచేసింది. మలేరియా తదితర వ్యాధుల చికిత్సలో వాడుతున్న ఈ మందులను కొవిడ్‌-19 విషయంలో ఔషధ పరిశోధనలకు మాత్రమే పరిమితం చేయటం మంచిదని ఈ అంతర్జాతీయ సంస్థ ఉన్నతాధికారి ఒకరు సూచించారు. కొవిడ్‌ చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను కొన్ని దేశాలు ఇప్పటికే వాడుతున్న విషయంపై సంస్థ ఆరోగ్య అత్యయిక పరిస్థితి ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ స్పందించారు. వివిధ వ్యాధుల చికిత్సలో హైడ్రాక్సీ ఔషధాలను వాడేందుకు అనుమతి ఉందని... ఐతే వీటిని కొవిడ్‌-19 చికిత్సలో లేదా అది రాకుండా నిరోధించటంలో ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదన్నారు.అయితే కరోనా విషయంలో ఈ ఔషధ వాడకం అనేది ఆయా దేశాల విచక్షణపై ఆధారపడి ఉంటుందని డాక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ అభిప్రాయపడ్డారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని