దేశభక్తుడి తనయుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నా

తాజా వార్తలు

Published : 21/05/2020 19:20 IST

దేశభక్తుడి తనయుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నా

తండ్రి వర్ధంతి రోజున రాహుల్ ట్వీట్ 

దిల్లీ: ‘నిజమైన దేశభక్తుడికి తనయుడిగా ఉన్నందుకు గర్వంగా ఉంది’ అంటూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి రోజున కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన తండ్రిని గుర్తుచేసుకుంటూ..ప్రధానిగా ఆయన చేసిన సేవలను ప్రస్తావించారు. 29 సంవత్సరాల క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులో పర్యటిస్తూ శ్రీ పెరంబుదూరు వద్ద రాజీవ్ హత్యకు గురయ్యారు. 

‘నిజమైన దేశభక్తుడు, ఉదారవాది, దయాహృదయం కలిగిన తండ్రికి తనయుడిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. ప్రధానిగా రాజీవ్‌జీ భారత్‌ను అభివృద్ధి మార్గంలో పయనించేలా చేశారు. తన దూరదృష్టితో అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని దేశ సాధికారతకు కృషి చేశారు. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రేమ, కృతజ్ఞతాభావంతో సెల్యూట్‌ చేస్తున్నాను’ అని ట్విటర్ వేదికగా రాహుల్‌ గాంధీ తన తండ్రి ఫొటోను షేర్ చేశారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆయన్ను స్మరించుకుంటూ ఓ వీడియోను ట్వీట్‌ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాజీవ్‌ గాంధీకి నివాళులు అర్పించారు.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని