మళ్ళీ విమాన ప్రయాణం.. ఎలా ఉందంటే...

తాజా వార్తలు

Published : 25/05/2020 20:37 IST

మళ్ళీ విమాన ప్రయాణం.. ఎలా ఉందంటే...

దిల్లీ: రెండు నెలల దీర్ఘకాల విరామం అనంతరం భారత్‌లో దేశీయ విమాన ప్రయాణాలు ఈ రోజు మళ్లీ మొదలయ్యాయి. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి 25 నుంచి విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా, నేడు విమానాల్లో ప్రయాణించిన కొందరు తమ అభిప్రాయాలను, అనుభవాలను పంచుకున్నారు. దేశంలోని వివిధ నగరాల నుంచి బయలుదేరిన వీరు, వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు ఉండటంపై అయోమయం వ్యక్తం చేస్తున్నారు.

దిల్లీ- భువనేశ్వర్‌ల మధ్య విస్తారా విమానంలో ప్రయాణించిన వారిలో ఒడిశా బిజూ జనతాదళ్‌ పార్టీకి చెందిన ఎంపీ అనుభవ్‌ మహంతి ఉన్నారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నుంచి దిల్లీలోనే ఉండిపోయిన ఆయన, ఇన్నాళ్లకు మరలా తన స్వంత రాష్ట్రానికి వెళ్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. విమానం ఎక్కేముందు కాస్త ఆందోళనగా అనిపించిందని... అయితే, ప్రయాణీకులందరూ రక్షణ నిబంధనలను పాటించటంతో భయం తగ్గిందని, తమ విమానంలో అతి తక్కువ మంది ఉన్నారని పుణె విమానాశ్రయంలో దిగిన ఓ మహిళ తెలిపారు.

అయితే ఆయా రాష్ట్రాల్లో క్వారంటైన్‌, ఐసోలేషన్‌ నిబంధనలు వేర్వేరుగా ఉండటంతో ప్రయాణీకులతో పాటు, విమాన సిబ్బంది కూడా అసౌకర్యానికి గురయ్యారు. ఇక సోమవారం విధుల నిర్వహణ పూర్తయిన అనంతరం... తాము ఇళ్లకు వెళ్లాలా లేదా 14 రోజులు హోమ్‌క్వారంటైన్లో ఉండాలా అనే విషయంపై స్పష్టత లేదని పైలట్లు భావిస్తున్నారు.

కాగా దిల్లీ విమానాశ్రయంలో తొలిరోజు టేకాఫ్‌ తీసుకున్న పుణె, ముంబయి విమానాలు రెండూ ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగోకు చెందినవి కావటం గమనార్హం. కాగా, సుదీర్ఘ విరామం అనంతరం చెన్నైకి బయలుదేరిన తొలి విమానంలో 116 మంది ప్రయాణీకులున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఉదయం 6:40 గంటలకు దిల్లీకి తిరిగివచ్చిన తొలి విమానంలో కేవలం 27 మంది ప్రయాణీకులున్నారు. కేంద్రం అనేక దఫాలు చర్చలు జరిపిన అనంతరం, అదీ పరిమిత సంఖ్యలో మాత్రమే విమానాలు నడిపేందుకు రాష్ట్రాలు అంగీకరించాయి. తుపాను విధ్వంసానికి గురైన కోల్‌కతా, బగ్దోగ్రా విమానాశ్రయాల్లో 28 నుంచి విమాన రాకపోకలు మొదలవుతాయని అధికారులు తెలిపారు. కాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ విమానాశ్రయాల్లో రోజుకు 20 విమానాలకు మాత్రమే అనుమతి ఉందని వారు వెల్లడించారు. కాగా, ముంబయిలో 50, హైదరాబాద్‌లో 30 సర్వీసులు ఉంటాయి.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు చేరుకునే విమాన ప్రయాణీకులు కొవిడ్‌-19 పరీక్షలో నెగటివ్‌ అని తేలేవరకు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలుత దేశవ్యాప్తంగా 1050 విమానాలను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆదివారం  కేంద్రం నిబంధనలు సవరించటంతో పలు సర్వీసులు రద్దయ్యాయి, 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని