హెచ్చరించినా పట్టించుకోనిపైలట్‌..
close

తాజా వార్తలు

Published : 26/05/2020 01:51 IST

హెచ్చరించినా పట్టించుకోనిపైలట్‌..

పాక్‌ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. లాహోర్‌ నుంచి ప్రయాణికులతో బయలుదేరిన విమానం కరాచీకి దగ్గర్లో కూలిపోయింది. అయితే ఆ ప్రమాదానికి ముందు పైలట్‌ను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) విభాగం మూడు సార్లు హెచ్చరించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ నివేదిక ద్వారా వెల్లడవుతుంది. విమానం ఉన్న ఎత్తు, ల్యాండ్ అయ్యే ముందు దాని వేగం గురించి ఏటీసీ చేసిన హెచ్చరికలను అతడు పట్టించుకోలేదని తెలుస్తుంది. 

కరాచీకి 15 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు విమానం 10 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుందని, వెంటనే 7,000 అడుగుల పరిధిలోకి తీసుకురావాలని అధికారులు మొదటి సారి పైలట్‌ను హెచ్చరించారని పాకిస్థాన్‌ సివిల్ ఏవియేషన్ అథారిటీ తయారు చేసిన ప్రాథమిక నివేదిక వెల్లడించింది. ఎత్తు తగ్గించకపోగా, సాఫీగానే ఉందని పైలట్ వారికి చెప్పారని తెలిపింది. కరాచీకి 10 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు కూడా ఎత్తును తగ్గించాలంటూ ఇదేవిధమైన హెచ్చరిక చేసినా అతడు పట్టించుకోలేదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అప్పుడు కూడా తాను చూసుకోగలని చెప్పినట్లు వారు పేర్కొన్నారు. కరాచీలో మొదటి సారి విమానం దించాలనుకున్నప్పుడు, కుదుపులకు లోనై, రన్‌వే కొద్ది మేర పాడైనట్లు వెల్లడించారు. దాంతో కొద్ది మేర మంటలు చెలరేగాయిని, అప్పుడే ఆయిల్ ట్యాంక్, పైప్‌ లీక్ అయ్యుండొచ్చని వారు అభిప్రాయడ్డారు. అప్పుడు విమానాన్ని 3000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లమని చెప్పినా, అతడు మాత్రం 1800 అడుగుల వద్దే ఉంచాడని చెప్పారు. అయితే ఆ ఎత్తుకు రాకపోవడానికి ఇంజిన్‌లో సమస్య కూడా కారణం కావొచ్చన్నారు. ఆ తరవాత విమానం ఒక్కసారిగా కూలిపోయి ఉంటుందన్నారు. 

కరోనా నేపథ్యంలో ఆంక్షలను సడలిస్తూ దేశీయంగా విమాన రాకపోకలకు పాకిస్థాన్ ప్రభుత్వం మే 16న అనుమతిచ్చింది. ఈ ప్రమాదం జరగడంతో మళ్లీ ఆ అనుమతులను వెనక్కి తీసుకుంది. ఘటన జరిగినప్పుడు విమానంలో ఉన్న 91 మంది ప్రయాణికులు, ఎనిమిదిమంది సిబ్బందిలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని