సోమాలియాలో బాంబు దాడి.. 10 మంది మృతి

తాజా వార్తలు

Published : 31/05/2020 23:30 IST

సోమాలియాలో బాంబు దాడి.. 10 మంది మృతి

మొగదిషు (సోమాలియా): సోమాలియాలో బస్సుపై ఉగ్రవాదులు మందుపాతరలతో దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. మరో 13 మంది గాయపడ్డారు. ఆ దేశ రాజధాని మొగదిషుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హవా అబ్ది ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రయాణికుల వాహనమే లక్ష్యంగా రోడ్డు పక్కనే ఏర్పాటు చేసిన మందుపాతర పేలడంతో ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి మినీ బస్సు తునాతునకలైంది.  బస్సు మొగదిషుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 10 మంది మరణించగా.. మరో 13 మంది గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సోమాలియా ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు. ఇటీవల కాలంలో జరిగిన పలు దాడుల వెనుక అల్‌-షబాబ్‌ అనే ఉగ్రవాద సంస్థ హస్తం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని