శభాష్‌ నాసా, స్పేస్‌ఎక్స్‌..!

తాజా వార్తలు

Published : 02/06/2020 02:02 IST

శభాష్‌ నాసా, స్పేస్‌ఎక్స్‌..!

 ఇస్రో అభినందన


బెంగళూరు: తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారిగా అమెరికా భూభాగం నుంచి మానవసహిత అంతరిక్ష యాత్రను విజయవంతంగా చేపట్టిన అమెరికాకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అభినందనలు తెలిపింది. ఇది చరిత్రాత్మక ఘట్టమని పేర్కొంది. ఈ మేరకు అమెరికా రోదసి సంస్థ (నాసా), ప్రైవేటు కంపెనీ స్పేస్‌ఎక్స్‌ను కొనియాడింది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక ఆదివారం ఇద్దరు నాసా వ్యోమగాములను భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్‌ఎస్‌)కి చేరవేసిన సంగతి తెలిసిందే. వాణిజ్య అంతరిక్ష యాత్రల శకానికి ఇది శ్రీకారం చుట్టింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని