భారత్‌లో కరోనా: 24గంటల్లో 9304 కేసులు

తాజా వార్తలు

Updated : 04/06/2020 10:42 IST

భారత్‌లో కరోనా: 24గంటల్లో 9304 కేసులు

దేశంలో 6వేలు దాటిన కరోనా మరణాలు..

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. గత కొన్నిరోజులుగా దేశంలో రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 9304పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా వైరస్‌ వెలుగుచూసిన తర్వాత 24గంటల వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో గురువారం ఉదయానికి దేశంలో కొవిడ్‌-19 బారినపడ్డ వారిసంఖ్య 2,16,919కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. మరణాల సంఖ్య కూడా రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా దేశంలో ప్రతిరోజు 200పైగా మరణాలు సంభవిస్తున్నాయి. గడచిన 24గంటల్లో అత్యధికంగా 260మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకేరోజు ఈ స్థాయిలో మరణించడం కూడా ఇదే తొలిసారి. దేశంలో ఇప్పటివరకు కొవిడ్‌ సోకి 6075మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో కరోనా మరణాల్లో ప్రపంచంలో ఇప్పటివరకు 13స్థానంలో కొనసాగిన భారత్‌, తాజాగా 12స్థానానికి ఎగబాకింది. ఇక మనదేశంలో కొవిడ్‌ సోకిన వారిలో ఇప్పటివరకు 1,04,107 మంది కోలుకోగా మరో 1,06,737 మంది చికిత్స పొందుతున్నారు.

దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా కేవలం నాలుగు రోజుల్లోనే దాదాపు వెయ్యి మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా కేసులు గత 15రోజుల్లోనే రెట్టింపు కాగా.. మరణాలు కూడా 17రోజుల్లోనే రెట్టింపు అయ్యాయి. మే 18న 3029 మరణాలు ఉండగా..జూన్‌ 4వ తేదీనాటికి 6075కి చేరింది. ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ 12స్థానానికి చేరింది. ప్రస్తుతం కెనడా 7400 మరణాలతో 11స్థానంలో ఉండగా.. 5900 మరణాలతో నెదర్లాండ్‌ 13స్థానంలో కొనసాగుతోంది. కొవిడ్‌-19 కేసులు అధికంగా ఉన్న దేశాల్లో మాత్రం భారత్‌ 7 స్థానంలో ఉంది. దాదాపు 2లక్షల 33వేల కేసులతో ఇటలీ ఆరవ స్థానంలో ఉండగా..లక్షా 84వేల కేసులతో జర్మనీ ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని