ఏనుగు కేసు: ముగ్గురు అనుమానితుల గుర్తింపు

తాజా వార్తలు

Published : 04/06/2020 18:18 IST

ఏనుగు కేసు: ముగ్గురు అనుమానితుల గుర్తింపు

వెల్లడించిన కేరళ సీఎం

తిరువనంతపురం: కేరళలో ఏనుగు మృతి ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళ ఈ కేసులో ముందడుగు పడింది. ఈ ఘటన బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు అనుమానితుల్ని కేరళ పోలీసులు గుర్తించి విచారణ జరుపుతున్నారు. అనుమానితుల్ని విచారిస్తున్నారని, న్యాయం గెలిచి తీరుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ట్వీట్‌చేశారు.

పాలక్కడ్‌ జిల్లాలో ఏనుగు మృతి ఘటనలో విచారణ జరుగుతోందని విజయన్‌ పేర్కొన్నారు. అటు పోలీసులు, ఇటు అటవీ శాఖ అధికారులు కలిసి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. జిల్లా పోలీసు అధికారి, అటవీ అధికారులు ఘటనా స్థలిని పరిశీలించారని, దోషులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. ఇలాంటి అమానవీయ ఘటనల వెనుక ఉన్న కారణాలను కూడా అన్వేషిస్తామని పేర్కొన్నారు. అదే సమయంలో కొందరు ఈ ఘటనను విద్వేషపూరిత ప్రచారానికి వినియోగించుకుంటున్నారని సీఎం మండిపడ్డారు. మరోవైపు ఇది ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చని కేరళ చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారి సురేంద్రకుమార్ అభిప్రాయపడ్డారు. అది అడవి ఏనుగు అని, ఎవరూ దాని వద్దకు వెళ్లే సాహసం చేయకపోవచ్చని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని