సివిల్స్‌ పరీక్షల తేదీ ఖరారు  
close

తాజా వార్తలు

Published : 05/06/2020 17:51 IST

సివిల్స్‌ పరీక్షల తేదీ ఖరారు  

దిల్లీ: యూపీఎస్సీ 2020 సంవత్సరానికి నిర్వహించాల్సిన పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది. ఈ మేరకు అక్టోబరు 4, 2020న యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష, జనవరి 8, 2021 తేదీన మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షను మే 31న నిర్వహించాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేశారు.

అలాగే 2019 సంవత్సరానికి సంబంధించి నిర్వహించాల్సిన పర్సనాలిటీ టెస్టులు జులై 20, 2020 నుంచి ప్రాంరంభమవుతాయని.. ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం అందిచనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. ప్రతి ఏడాది సుమారు ఏడు లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలకు హాజరవుతుంటారు. అయితే ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని