కరోనా పరీక్షల్లో కేజ్రీవాల్‌కు నెగటివ్‌ 

తాజా వార్తలు

Published : 09/06/2020 19:10 IST

కరోనా పరీక్షల్లో కేజ్రీవాల్‌కు నెగటివ్‌ 

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు కరోనా పరీక్షల్లో నెగటివ్ అని నిర్ధారణ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం ఆయన నుంచి నమూనాలను సేకరించిన వైద్య బృందం వాటిని కరోనా పరీక్షలకు పంపారు. పరీక్షల ఫలితాల్లో నెగటివ్‌ అని తేలిందని, ఆయనలో ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైద్యాధికారులు తెలిపారు. గత మూడు రోజులుగా జ్వరం, గొంతునొప్పి, తదితర కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతుండటంతో సోమవారం ఆయన స్వీయనిర్భంధంలోకి వెళ్లారు. కేజ్రీవాల్‌కు డయాబెటీస్‌ కూడా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు పరీక్షలు చేయించుకున్నట్లు ఆప్‌ ఎమ్మెల్యే రాఘవ్‌ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

దేశరాజధానిలో గత కొద్ది రోజులుగా కరోనా తీవ్రత పెరగడంతో, సమూహ వ్యాప్తి ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా స్పష్టత ఇచ్చారు. దిల్లీలో సమూహ వ్యాప్తి లేనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపిందని పేర్కొన్నారు. మంగళవారం నాటికి రాష్ట్రంలో 29,943 కేసులు నమోదుకాగా, వారిలో ఇప్పటివరకు 874 మంది మృత్యువాతపడ్డారు. రాబోయే రెండు వారాల్లో కేసుల సంఖ్య 56 వేలకు చేరుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని