ఆ విషయంలో భారత్‌ పట్ల ఆందోళనగా ఉన్నాం

తాజా వార్తలు

Published : 11/06/2020 15:40 IST

ఆ విషయంలో భారత్‌ పట్ల ఆందోళనగా ఉన్నాం

మత స్వేచ్ఛ ఉల్లంఘన ఘటనలపై అమెరికా వ్యాఖ్యలు

వాషింగ్టన్: భారత్ అన్నిమతాల పట్ల సహనంతో, మర్యాదపూర్వకంగా వ్యవహరించేది.. కానీ, కొంతకాలంగా మతస్వేచ్ఛ విషయంలో జరుగుతున్న ఘటనలపై యూఎస్‌ ఆందోళన చెందుతోందని యూఎస్ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘2019 అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదిక’ విడులైన నేపథ్యంలో ఆ దేశం నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా మత స్వేచ్ఛ ఉల్లంఘన ఘటనలను నమోదు కాగా, ఆ నివేదికను సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో విడుదల చేశారు. 
‘భారత్‌లో జరుగుతున్నదానిపై మేం ఆందోళనగా ఉన్నాం. చరిత్రను గమనిస్తే ఆ దేశం మతాల పట్ల సహనంగా, మర్యాదపూర్వంగా వ్యవహరించేది. కానీ, కొంతకాలంగా పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ ఘటనలను తగ్గించడానికి భారత్ చాలా కృషి చేయాల్సి ఉంది. నా ఆందోళన ఏంటంటే ప్రభుత్వం తీసుకొనే చర్యలు ముందుకు వెళ్లకపోతే..ఈ హింసాత్మక ఘటనలు మరింత పెరిగే అవకాశం ఉంది’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగంలోని శామ్యూల్ బ్రౌన్‌బ్యాక్‌ అనే అధికారి మీడియా వద్ద వ్యాఖ్యానించారు.  

యూఎస్‌ గతేడాది జూన్‌లో మత స్వేచ్ఛ పై వెలువరించిన నివేదికను భారత ప్రభుత్వం తోసిపుచ్చుతూ..‘లౌకికవాదం విషయంలో భారత్‌ గర్వంగా ఉంది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా, భిన్న జాతుల సమాహారంగా ఉన్న ఈ దేశం సహనం, సమ్మిళితత్వానికి కట్టుబడి ఉంది. మైనారిటీలతో సహా, ప్రజలందరికి ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగం ప్రసాదించింది. రాజ్యాంగపరంగా వచ్చిన ఈ హక్కులపై విదేశీ ప్రభుత్వం, సంస్థ వ్యాఖ్యలు చేయడాన్ని మేం అనుమతించం’ అని ఘాటుగా స్పందించింది. హోం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం..2008 నుంచి 2017 మధ్యకాలంలో 7,484 మతపరమైన ఘర్షణలు చోటుచేసుకోగా, 1,100 మంది మరణించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని