చైనా సంస్థపై తొలి వేటు

తాజా వార్తలు

Published : 18/06/2020 17:53 IST

చైనా సంస్థపై తొలి వేటు

కాంట్రాక్టు రద్దు చేసిన భారతీయ రైల్వే 

దిల్లీ: చైనాతో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన తర్వాత దేశ వ్యాప్తంగా చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే వాదనలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే చైనా సంస్థకు కేటాయించిన కాంట్రాక్ట్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్‌ అండ్ డిజైన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్ సంస్థకు 2016లో కేటాయించిన కాంట్రాక్టును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ మేరకు భారతీయ రైల్వేకు చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఐఎల్) సంస్థ ఒక ప్రకటన చేసింది. కాన్పూర్‌- దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ సెక్షన్‌ మధ్య 417 కి.మీ. మేర టెలీకమ్యూనికేషన్, సిగ్నలింగ్ ప్రాజెక్టుకు సంబంధించి డీఎఫ్‌సీసీఐఎల్ చైనా సంస్థతో ఒప్పందం చేసుకుంది. దీని విలువ రూ.471 కోట్ల రూపాయలు. ఒప్పందం ప్రకారం చైనా సంస్థ అవసరమైన సాంకేతిక పత్రాలను సమర్పించలేదని, అలానే ఇంజనీర్లు, ఇతర సిబ్బందిని తమకు కేటాయించలేదని తెలిపింది. దీనిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు డీఎఫ్‌సీసీఐఎల్ వెల్లడించింది. 

గల్వాన్‌ లోయ ఘటన తర్వాత చైనాపై ఆర్థికపరమైన చర్యలు చేపట్టాలని భారత్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు దాదాపు 100 రకాల చైనా ఉత్పత్తులపై నిషేధం విధించడంతోపాటు, ఆ దేశానికి చెందిన సంస్థలు 5జీతో పాటు ఎలాంటి ఇతర కాంట్రాక్టులు సొంతం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని భారత్ భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని