దిల్లీ ఆరోగ్య మంత్రికి ప్లాస్మాథెరపీ

తాజా వార్తలు

Updated : 20/06/2020 16:25 IST

దిల్లీ ఆరోగ్య మంత్రికి ప్లాస్మాథెరపీ

దిల్లీ: కరోనాతో పోరాడుతున్న దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు వైద్యులు ప్లాస్మాథెరపీ నిర్వహించారు. ఆరోగ్య పరిస్థితి నిన్న విషమంగా మారడంతో ఆయన్ను మ్యాక్స్‌ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందనీ.. ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తోందని అధికారులు తెలిపారు. 

ఇటీవల తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో దిల్లీలోని రాజీవ్‌గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో సత్యేందర్‌ చేరిన విషయం తెలిసిందే. అయితే తొలిసారి చేసిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌గా తేలగా.. ఆ తర్వాత మళ్లీ బుధవారం  నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే నిన్న ఆయన ఆరోగ్యం విషమించడంతో దిల్లీలోని మ్యాక్స్‌ ఆస్పత్రికి తరలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని