మిజోరంలో భూకంపం.. ప్రధాని ఆరా

తాజా వార్తలు

Updated : 22/06/2020 14:13 IST

మిజోరంలో భూకంపం.. ప్రధాని ఆరా

ఐజ్వల్: మిజోరంలో సోమ‌వారం తెల్లవారుజామున 4:10 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.3గా న‌మోదైన‌ట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ(ఎన్‌సిఎస్) తెలిపింది. దీని ప్రభావం ఎక్కువ‌గా ఛంపాయ్ జిల్లాలో న‌మోదైంద‌ని దాదాపు 27 కిలోమీట‌ర్ల లోతు వ‌ర‌కు భూమి కంపించిన‌ట్లు వెల్లడించింది. అయితే దీని ద్వారా ఎటువంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదని అధికారులు వెల్లడించారు. కానీ, కొన్ని ఇళ్లు, భవనాలు నేలకూలినట్లు తెలిపారు. అలాగే రోడ్లపై భారీ పగుళ్లు ఏర్పడడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు.

ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. మిజోరం ముఖ్యమంత్రి జోరంథాంగాతో మాట్లాడి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర తరఫున కావాల్సిన అన్ని రకాల సహాయ, సహకారాల్ని అందిస్తామని భరోసా ఇచ్చారు.   

ఈశాన్య భారతంలో వరుసగా ఇది రెండో భూకంపం. ఆదివారం ఉదయం 4:16 గంటలకు మ‌ణిపూర్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.1గా న‌మోదైంది. అలాగే, జూన్ 18న ఐదు ఈశాన్య రాష్ర్టాల్లో భూకంపం సంభ‌వించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని