క‌రోనా వ్యాక్సిన్ క‌నుగొన్న నైజీరియా!

తాజా వార్తలు

Published : 23/06/2020 01:14 IST

క‌రోనా వ్యాక్సిన్ క‌నుగొన్న నైజీరియా!

వాస్త‌వ‌మే అంటున్న స్థానిక శాస్త్ర‌వేత్త‌లు

ఇడె, ఒసున్‌: ప‌్ర‌పంచ వ్యాప్తంగా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న క‌రోనా వైర‌స్‌కు నైజీరియా శాస్త్ర‌వేత్తల బృంద‌మొక‌టి వ్యాక్సిన్ క‌నుగొన్న‌ట్టు స‌మాచారం.  వ్యాక్సిన్ క‌నుగొన్న‌ట్టు శుక్ర‌వారం నైజీరియ‌న్ యూనివ‌ర్సిటీలు ప్ర‌క‌టించాయ‌ని స్థానిక మీడియా ద్వారా తెలిసింది. 

భార‌త్‌, అమెరికా, బ్రిట‌న్‌, ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, జ‌పాన్‌, చైనా, ఆస్ట్రేలియా స‌హా అనేక దేశాలు వ్యాక్సిన్ కోసం విస్తృతంగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కోట్ల‌లో ధ‌నం వెచ్చిస్తున్నాయి.  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌కారం 13 వ్యాక్సిన్ల‌ను మ‌నుషుల‌పై ప్ర‌యోగిస్తున్నారు. 120 సంస్థ‌లు సూదిమందు క‌నుగొన‌డంలో నిమ‌గ్న‌మ‌య్యాయి.

ఆఫ్రికాలో ఆఫ్రిక‌న్ల కోసం ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామ‌ని అడిలెక్ యూనివ‌ర్సిటీలో మెడిక‌ల్ వైరాల‌జీ, ఇమ్యునాల‌జీ, బ‌యో ఇన్ఫ‌ర్మేటిక్స్ ప్ర‌త్యేక నిపుణుడు, డాక్ట‌ర్ ఒల‌డిపో కొల‌వోల్ ప్ర‌క‌టించార‌ని ది గార్డియ‌న్ నైజీరియా తెలిపింది. ఈ ప‌రిశోధ‌న‌కు ఆయ‌నే  నేతృత్వం వ‌హించారు. 

ఈ సూదిమందు అంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చేందుకు క‌నీసం 18 నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని ఒల‌డిపో అన్నారు.  మ‌రిన్ని ట్ర‌య‌ల్స్‌, విశ్లేష‌ణ అవ‌స‌ర‌మ‌ని, వైద్య అధికార వ‌ర్గాల నుంచి అనుమ‌తుల రావాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. సార్స్ కొవ్‌2 జీనోమ్ కోసం ఆఫ్రికా మొత్తం విస్తృతంగా అన్వేషించామ‌ని ఆయ‌న‌ వెల్ల‌డించారు.

వ్యాక్సిన్ క‌నుక్కోవ‌డం వాస్త‌వ‌మేన‌ని  ప్రీసియ‌స్ కార్న‌ర్‌స్టోన్ వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ జూలియ‌స్ ఒలోక్ సైతం తెలిపారు. ‘వ్యాక్సిన్ నిజ‌మే.  మేం చాలాసార్లు ప్ర‌యోగాలు చేసి విశ్లేషించాం. ఆఫ్రిక‌న్లే ల‌క్ష్యంగా త‌యారు చేశాం. ఇత‌రులు సైతం ఉప‌యోగించొచ్చు. ఇది ప‌నిచేస్తుంది. న‌కిలీది కాదు. అంకిత‌భావానికి వ‌చ్చిన ఫ‌లిత‌మే ఇది. చాలామంది శాస్త్ర‌వేత్త‌లు ఇందుకోసం ఎంత‌గానో  శ్ర‌మించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా  ఈ వ్యాక్సిన్ అవ‌స‌రం ఎంతో ఉంది. అందుకే మేం దీనిపై దృష్టిపెట్టాం’ అని ఆయ‌న వివ‌రించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని