భారత్-చైనా సరిహద్దులో కూలిన వంతెన

తాజా వార్తలు

Published : 24/06/2020 01:28 IST

భారత్-చైనా సరిహద్దులో కూలిన వంతెన

డెహ్రాడూన్: భారత్-చైనా సరిహద్దుల్లో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వంతెన కూలిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌-చైనా సరిహద్దుకు 50 కి.మీ దూరంలో ఉత్తరాఖండ్‌లోని పితోర్గడ్‌ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీ క్రేన్‌ మోసుకెళ్తున్న ఓ ట్రక్కు బెయిలీ (స్టీలు భాగాలతో తయారైన) వంతెనపై నుంచి వెళ్తున్న క్రమంలో అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవరుతో సహా మరో వ్యక్తి గాయపడ్డాడు.

40 అడుగుల పొడవైన ఈ వంతెనను 2009లో నిర్మించారు. బరువు ఎక్కువ కావడం వల్లే వంతెన కూలిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. వంతెన సామర్థ్యం 18 టన్నులు కాగా క్రేన్‌,లారీ రెండు కలిపి 26 టన్నుల బరువు ఉన్నట్లు తెలిపారు. జోహార్ వ్యాలీలోని సుమారు 15 గ్రామాలు రాకపోలకు సాగించేందుకు ఈ వంతెనను ఉపయోగిస్తాయని, ఇది కూలిపోవడంతో ఆయా గ్రామాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అన్నారు. కొత్తగా మరో వంతెన నిర్మించేందుకు సుమారు 15 రోజులు సమయం పడుతుందని, క్రేన్‌ తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ట్రక్కు డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరుగుతున్న రహదారి పనుల నిర్మాణం కోసం ఈ క్రేన్ తరలిస్తున్నట్లు సమాచారం. ఈ వంతెనపై నుంచే ఆర్మీ, ఐటీబీపీ (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు) రాకపోకలు సాగిస్తుంటారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని