దిల్లీలో విస్తృతంగా కరోనా పరీక్షలు!

తాజా వార్తలు

Published : 24/06/2020 14:16 IST

దిల్లీలో విస్తృతంగా కరోనా పరీక్షలు!

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ప్రతి ఇంట్లో జులై 6లోగా కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దిల్లీ కొవిడ్‌-19 కేసుల విషయంలో మంగళవారం నాటికి తమిళనాడును అధిగమించి దేశంలోనే రెండోస్థానానికి చేరుకొంది. 62,000 పైగా కేసులు, 261 కంటైన్‌మెంట్‌ జోన్లతో కూడిన దిల్లీలో ఇప్పటి వరకూ 2000కు పైగా మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ‘కొవిడ్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌’ అనే నూతన విధానానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.

దేశ రాజధానిలో అందోళనకరంగా పెరుగుతున్న కేసులను నియంత్రించే విషయమై గత వారం హోంమంత్రి అమిత్‌ షాతో అనేక దపాల చర్చలు జరిపిన అనంతరం కేజ్రీవాల్‌ ఈ నిర్ణయాన్ని వెలువరించారు. జూన్‌ 27 నుంచి మొదలయ్యే ఈ సర్వేలో ఇరవై వేల నమూనాలు సేకరించనున్నారు. కాగా, వాటి ఫలితాలను జులై 10 కల్లా విడుదల చేస్తారు. జూన్‌ 30 కల్లా కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్న అన్ని గృహాల్లో కొవిడ్‌ పరీక్షలు పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.

మారిన వ్యూహాలను అనుసరించి... దిల్లీలో జిల్లా స్థాయిలో కఠిన పర్యవేక్షణ అమలులో ఉంటోంది. ఇందుకు వినియోగించిన ప్రత్యేక జిల్లా స్థాయి కార్యాచరణ బృందాలు గతంలో కలెక్టర్‌ నేతృత్వంలో పనిచేయగా.. ప్రస్తుతం పోలీస్‌ కమిషనర్‌, ఉన్నతాధికారులు, అంటువ్యాధి నిపుణులు, ఐటీ నిపుణులు తదితరులను వీటిలో భాగస్వాములను చేశారు. తాము చేపట్టిన ‘హోం ఐసోలేషన్‌’ పథకం చక్కని ఫలితాలనిస్తోందని... తాను వ్యక్తిగతంగా బాధితులకు ఫోన్‌ చేయగా వారు సంతృప్తి వ్యక్తం చేశారని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని