‘కరోనిల్‌’ విక్రయంపై ‘మహా’ నిషేధం! 

తాజా వార్తలు

Published : 26/06/2020 00:16 IST

‘కరోనిల్‌’ విక్రయంపై ‘మహా’ నిషేధం! 

ముంబయి: కరోనా రోగులకు చికిత్స కోసం పతంజలి ఆయుర్వేద సంస్థ తయారు చేశామన్న కరోనిల్‌ ఔషధంపై మహారాష్ట్ర సర్కార్‌ నిషేధం విధించింది. ఇలాంటి నకిలీ ఔషధాలను తమ రాష్ట్రంలో విక్రయించేందుకు అనుమతించబోమని రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ యోగా గురు రాందేవ్‌ బాబాను హెచ్చరించారు. ‘కరోనిల్‌’ ఔషధంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆయన ట్వీట్‌ చేశారు.  జైపూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సంస్థ అసలు ఈ ఔషధానికి క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగాయో లేదో నిర్ధారిస్తుందని పేర్కొన్నారు. 

కరోనాకు ఔషధం తయారుచేశామని యోగా గురువు బాబా రాందేవ్‌ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ రెండు రోజుల క్రితమే ప్రకటించగా.. ఆ ఔషధానికి సంబంధించిన వివరాలు సమర్పించాలని కేంద్రం ఆ సంస్థను ఆదేశించిన విషయం తెలిసిందే. సమగ్రంగా పరిశీలించే వరకూ ఔషధ ప్రచార కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఆయుష్‌ శాఖ ఆదేశించింది. అలాగే, ఈ ఔషధానికి ఎక్కడి నుంచి లైసెన్స్‌ తెచ్చుకున్నారో చెప్పాలని కోరుతూ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కూడా నోటీసులు జారీచేసింది. తాజాగా తమ రాష్ట్రంలో కరోనిల్‌ విక్రయాలను అనుమతించబోమని మహారాష్ట్ర సర్కార్‌ సైతం ప్రకటించడం గమనార్హం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని