పిడుగుల వర్షం.. 83మంది మృతి

తాజా వార్తలు

Published : 26/06/2020 00:18 IST

పిడుగుల వర్షం.. 83మంది మృతి

పట్నా: బిహార్‌లో కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన పిడుగుల వాన తీవ్ర ప్రాణ నష్టం కలిగించింది. ఐదు జిల్లాల పరిధిలో ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి 83మంది ప్రాణాలు కోల్పోయారు. గోపాల్‌ గంజ్‌ జిల్లాలో అత్యధికంగా 13మంది ప్రాణాలు కోల్పోయారు. నవాడాలో 8మంది, సివాన్‌, భగల్పూర్‌ నుంచి చెరో ఆరుగురు, దర్భాంగ, బంకా నుంచి చెరో ఐదుగురు చొప్పున.. ఇలా పలు ప్రాంతాల్లో మొత్తం 83మంది మృత్యువాతపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రుల్లో చేర్పించారు.

మరోవైపు, వర్షాల నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. బయటకు వెళ్లినవాళ్లు చెట్లకింద నిలబడవద్దని సూచిస్తున్నారు. భారత వాతావరణ శాఖ కూడా బిహార్‌లోని పలు ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. గురు, శుక్రవారాల్లో బిహార్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మృతుల్లో పలువురు చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలోకి ఇంకా రుతు పవనాలు ప్రవేశించడానికి ముందే వర్షాలు కురుస్తున్నాయి. 

మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం
ఈ ఘటనపై బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని