దిల్లీలో సామాజిక వ్యాప్తి లేదు: అమిత్ ‌షా

తాజా వార్తలు

Updated : 28/06/2020 20:11 IST

దిల్లీలో సామాజిక వ్యాప్తి లేదు: అమిత్ ‌షా

దిల్లీ : దేశ రాజధాని దిల్లీలో కరోనా రోజురోజుకి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,984 కొత్త కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 80 వేలు దాటింది. ఈ సంఖ్య కరోనాకు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో నమోదైన కేసులతో దాదాపు సరిసమానం. అయితే దేశరాజధానిలో ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పందించారు. సామాజిక వ్యాప్తి దశకు దిల్లీ చేరుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి తాను ముగ్గురు వైద్య నిపుణులను సంప్రదించినట్లు.. భయపడాల్సిన అవసరమేమీ లేదని పేర్కొన్నారు.

‘నేను డా.పాల్‌(నీతి ఆయోగ్‌)‌, డా.భార్గవ(ఐసీఎంఆర్‌ చీఫ్‌), డా.గులేరియా(ఎయిమ్స్‌ డైరెక్టర్‌)లతో మాట్లాడాను. సామాజిక వ్యాప్తి దశకు దిల్లీ చేరుకోలేదు. ఎక్కువ సంఖ్యలో నిర్వహించిన టెస్టుల కారణంగా అలాంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం రోజుకు సరాసరి 20 వేల పరీక్షలు చేస్తున్నాం. భయపడాల్సిన అవసరం లేదు’ అని షా వెల్లడించారు.

‘దిల్లీలో సామాజిక వ్యాప్తి ఉంది.. అయితే దాన్ని కేంద్రమే నిర్ధారించాలి’ అని దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ గతవారం ప్రకటించిన నేపథ్యంలో అమిత్‌షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తిలో మూడో దశ సామాజిక వ్యాప్తి. ఈ దశలో వైరస్‌ ఎలా సంక్రమించిందన్న విషయాన్ని గుర్తించడం కష్టం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని