నా ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధం: అభిషేక్‌ సింఘ్వీ

తాజా వార్తలు

Published : 30/06/2020 01:06 IST

నా ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధం: అభిషేక్‌ సింఘ్వీ

దిల్లీ: విషమ స్థితిలో ఉన్న కొవిడ్‌ రోగులకు తన ‘ప్లాస్మా’ ఇచ్చేందుకు సిధ్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ ప్రకటించారు. ప్రస్తుతం కరోనా వైరస్ సోకి స్వీయ నిర్బంధంలో ఉన్నానని.. తనకు ప్లాస్మా థెరపీ అవసరం రాలేదని ట్వీట్ చేశారు. ఈ థెరపీ వల్ల మంచి ఫలితాలున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్లాస్మా థెరపీపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. కొవిడ్‌తో బాధపడుతున్న దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం ప్లాస్మా థెరపీ తర్వాత మెరుగుపడిన విషయాన్ని ఈ సందర్భంగా సింఘ్వీ గుర్తుచేశారు. కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత వైద్యులు సిఫార్సు చేస్తే తన ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని సింఘ్వీ అన్నారు. కరోనాతో ఆస్పత్రిలో చేరిన సత్యేంద్ర జైన్‌కు ఓ దశలో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచిన విషయం తెలిసిందే. అనంతరం ప్లాస్మా థెరపీ అందించడంతో కోలుకుని ఈ నెల 26న డిశ్చార్జి అయ్యారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని