ఇమ్రాన్‌ అక్కసు: కరాచీ ఉగ్రదాడికి భారత్‌పై నిందలు

తాజా వార్తలు

Published : 30/06/2020 22:07 IST

ఇమ్రాన్‌ అక్కసు: కరాచీ ఉగ్రదాడికి భారత్‌పై నిందలు

కరాచీ: ఉగ్రవాదులకు స్వర్గధామమైన పాకిస్థాన్‌లో ముష్కరులు దాడి జరిపితే ఎవరిని నిందించాలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు అర్థం కావడం లేదేమో. అందుకే సోమవారం కరాచీలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ భవనంపై జరిగిన ఉగ్రదాడికి భారతే కారణమని ఆరోపించారు. దాడిలో భారత హస్తం కచ్చితంగా ఉంటుందని విచిత్రంగా మాట్లాడారు. ‘ఈ దాడి వెనక భారత్‌ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. ‘దాడి జరుగుతుందని నా మంత్రివర్గానికి రెండు నెలలుగా తెలుసు. నా మంత్రులకు ఈ విషయం చెప్పాను. మన ఏజెన్సీలన్నీ అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి’ అని  ఆరోపించారు. అయితే ఆయన వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది.

సోమవారం పాకిస్థాన్‌ జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ భవనంపై సాయుధులైన నలుగురు ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మృతిచెందారు. అందులో ఇద్దరు గార్డులు, ఒక పోలీసు ఉన్నారు. నలుగురు ముష్కరులు సైతం మరణించారు. కారులో వచ్చిన దుండగులు మొదట గ్రెనేడ్‌ విసిరారు. ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు. కాగా ఈ దాడికి తామే కారణమని బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని